గుజ‌రాత్‌లో 1000 దాటిన క‌రోనా కేసులు


గుజ‌రాత్‌లో కొవిడ్-19 వైర‌స్ వేగంగా విస్తరిస్తున్న‌ది. శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రివ‌ర‌కు కేవ‌లం 12 గంటల వ్య‌వ‌ధిలో కొత్త‌గా మరో 92 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయ‌ని గుజ‌రాత్ వైద్య‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,021కి చేరినట్టు అధికారులు తెలిపారు. ఇక 92 కొత్త‌ కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్ నుంచి 45 కేసులు నమోదయ్యాయి. సూరత్ నుంచి 14, వడోదర నుంచి 9, బారుచ్ నుంచి 8, నర్మద నుంచి ఐదుగురు కరోనా బారిన పడినట్టు ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జయంతి రవి వెల్ల‌డించారు.