కరోనా కట్టడిపై మంత్రుల సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో బుధవారం మంత్రులంతా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రభుత్వ సిబ్బందికి సూచనలు చేస్తూ.. ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తూ కనిపించారు. అధికారులతో సమీక్షలు జరిపి నిత్యావసరాల సమస్య రాకుండా చర్యలు తీసుకొంటున్నారు.