ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి. ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలి. ఒకరికి ఒకరు దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లాలో జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం జిల్లాలో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ ఉంటాయని, సంతలు, ఇతర మార్కెట్లు కూడా ఉండవని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఎవరికి వారు తమ ఇండ్లలోనే ఉండాలి. ఇంత విపత్కర పరిస్థితుల్లో తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పే విధంగా చప్పట్లు కొట్టి ఐక్యత చాటాలని కలెక్టర్ కోరారు. మీడియా సమావేశంలో కలెక్టర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటాల్లోనే.....
24 గంటలు కరోనా కర్ఫ్యూ