పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఇన్నేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఓ యజ్ఞంలా జరిగిన పల్లె ప్రగతి పల్లెజనాన్ని చైతన్యపర్చింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెరిగింది. ఉద్యమ స్ఫూర్తితో ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడు పట్టణప్రగతి అదే బాటన కొనసాగుతున్నది. బస్తీబాటతో పట్టణాలు కదులుతున్నాయి. అధికారులంతా బస్తీల్లో తిరుగుతున్నారు. ఏనాడూ గల్లీల్లో కనిపించని జిల్లా స్థాయి అధికారులు.. ఇప్పుడు జనానికి చేరువవుతన్నారు. సమస్యలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన వాటిని గుర్తించి నమోదు చేసుకుంటున్నారు. సత్వర పరిష్కారం వీలైతే అక్కడే చేసేస్తున్నారు.