సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్‌గా కనిపించి అలరించారు. అయితే చిత్ర షూటింగ్ సమయంలో మహేష్ బాబు, అనీల్ రావిపూడి, విజయశాంతి తదితరులు బోర్డర్ దగ్గర సైనికులని కలిసారు. వారితో ఫోటోలు దిగారు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మహేష్ సైనికులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చూస్తూ.. సైనికులందరిని కలుసుకోవడం అదృష్టం. నిస్సందేహంగా చెబుతున్న నా మరపురాని రోజులలో ఇది ఒకటి. ప్రతి రోజు మనల్ని రక్షిస్తున్న దేశ వీరులకి భారీ వందనం తెలియజేస్తున్నాను అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులతో దిగిన ఫోటోలు షేర్ చేసిన మహేష్